సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 17:56:12

కొవిడ్ థీమ్‌తో క‌రోనా క‌ర్రీ.. రుచి ఏమోగాని ఫోటోలు వైర‌ల్‌!

కొవిడ్ థీమ్‌తో క‌రోనా క‌ర్రీ.. రుచి ఏమోగాని ఫోటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ చెఫ్‌లు ఏ సంద‌ర్భాన్నీ వ‌దిలి పెట్ట‌రు. ఫ్రెండ్‌షిప్ డే, వాలెంటైన్స్ డే, ఫాద‌ర్స్ డే. మ‌ద‌ర్స్ డే అని ఏ డే వ‌చ్చినా వాటికి త‌గిన‌ట్లుగా వంట‌లు త‌యారు చేసి క‌స్ట‌మర్ల‌ను ఆక‌ర్షిస్తుంటారు. మ‌రి క‌రోనా సంద‌ర్భాన్ని వ‌దిలిపెడ‌తార‌ని ఎలా అనుకుంటారు. దీన్ని కూడా త‌మ స్టైల్‌లో క‌ర్రీలు త‌యారు చేసేశారు. మ‌లాయ్ కోఫ్తాల‌ను క‌రోనా వైర‌స్ రూపంలోకి మార్చి క‌ర్రీలుగా వ‌డ్డించేస్తున్నారు.

అంతేకాదు వీటికి నాన్‌, చ‌పాతీల‌ను సైతం మాస్కు‌లు, క‌రోనా ఆకారంలోకి మార్చేస్తున్నారు. క‌స్ట‌మ‌ర్ల కోసం పూర్తి బాధ్య‌త‌లు తీసుకుంటున్నామ‌ని జోద్‌పూర్‌ రెస్టారెంట్ య‌జ‌మాని చెప్పుకొచ్చారు. చేతుల‌కు గ్లౌజులు, శానిటౌజ‌ర్‌, మాస్కులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌ర్వాతే వంట‌లు త‌యారు చేస్తున్నామంటున్నారు. ఈ క‌ర్రీల ఫోటోలు చూడ్డానికి మాత్రం భ‌లే ఉన్నాయి. మ‌రి రుచి ఎలా ఉంటుందో గాని నెట్టింట వైర‌ల్‌గా మారాయి. logo