మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 15:03:41

ఇండియా లో కార్ల కొనుగోళ్లు ఇందుకే తగ్గుతున్నాయి

ఇండియా లో కార్ల కొనుగోళ్లు ఇందుకే తగ్గుతున్నాయి

ఢిల్లీ : కరోనా కారణంగా మార్చి నుంచి వాహనాల సేల్స్ పడిపోవడంతో ఆటోమొబైల్ రంగం కుదేలైంది. జూలైలో మాత్రం పుంజుకున్నాయి. కరోనా అంశాన్ని పక్కన పెడితే సాధారణంగా కార్ల కొనుగోలుకు సంబంధించి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ స్పందించారు. ఇండియాలో కార్లపై విధిస్తున్న అధిక సుంకాలు, పన్నుల వల్ల ఎక్కువమంది కొనలేకపోతున్నారని ఆర్సీ భార్గవ అన్నారు. జపాన్‌లో 10 శాతం, ఐరోపాలో 19 శాతం వ్యాట్ ఉందని ఇతర పన్నులు అక్కడ ఉండవని చెప్పారు. కానీ మన వద్ద భారీగా పన్నులు ఉంటాయన్నారు. 28 శాతం జీఎస్టీతో పాటు1శాతం నుంచి 22 శాతం సుంకాలు ఉన్నాయి. మన దేశంలో ఆదాయాలు తక్కువ అని, దీనికి పన్నులు ఎక్కువ కావడంతో ఔత్సాహికులు తగ్గుతున్నట్లు తెలిపారు. 

ఇతర కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ దేశాలతో పోలిస్తే మన దేశంలో కార్ల పైన ఎక్కువ పన్నులు ఉన్నాయని, అందుకే ఎక్కువమంది కొనలేకపోతున్నారని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. పన్నులు సహా కారు ధర అధికం కావడంతో పాటు రుణాలు పొందడం కూడా భారంగా మారిందని ఆర్సీ భార్గవ అన్నారు. అందుకే విక్రయాలు తగ్గాయని చెప్పారు. వాహన రంగంలో 50 శాతం వాటా కార్లదేనని, తయారీ రంగంలో 40 శాతం వాటా వాహన రంగానిది ఉన్నట్లు తెలిపారు. మార్చి నుంచి కరోనా ప్రభావం ఆటో రంగంపై తీవ్రంగా పడినట్లు తెలిపారు.

గతేడాది మందగమనం, ఈసారి కరోనా ప్రభావం చూపిన విషయం తెలిసిందే. కారు కొనుగోలుకు అయ్యే ఖర్చు పెరుగుదల, రుణం పొందడానికి అడ్డంకులు కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణమైనట్లు  చెప్పారు. 2025 నాటికి జీడీపీలో మ్యానుప్యాక్చరింగ్ వాటా 25 శాతానికి చేరుకోవాలంటే కార్ల అమ్మకాలు వేగంగా పెరగాల్సి ఉందని అన్నారు. పాసింజర్ వెహికిల్స్ పై 28 శాతం జీఎస్టీ ఉంది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లపై 1 శాతం ట్యాక్స్ నుంచి ఎస్‌యూవీ కార్లపై 22 శాతం వరకు పన్నులు ఉన్నాయి.logo