గురువారం 04 మార్చి 2021
National - Jan 17, 2021 , 11:30:51

కుట్ర‌తోనే రైతుల విష‌యంలో కేంద్రం కాల‌యాప‌న‌: అఖిల‌భార‌త‌ కిసాన్ స‌భ

కుట్ర‌తోనే రైతుల విష‌యంలో కేంద్రం కాల‌యాప‌న‌: అఖిల‌భార‌త‌ కిసాన్ స‌భ

న్యూఢిల్లీ: కేంద్ర వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా తాము ఆందోళ‌న మొద‌లుపెట్టి రెండు నెల‌లు పూర్త‌యినా ప్ర‌భుత్వం మాత్రం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అఖిలభార‌త కిసాన్ మ‌హాస‌భ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ హ‌న‌న్ మొహ‌ల్లా విమర్శించారు. రెండు నెల‌లుగా చ‌లిలో ఎన్నో క‌ష్టాలు అనుభవిస్తూ ఆందోళ‌న కొనసాగిస్తున్నామ‌ని, విప‌రీత‌మైన చ‌లి కార‌ణంగా చ‌చ్చిపోతున్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయినా ప్ర‌భుత్వం నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ చ‌ర్చ‌ల కోసం తేదీల మీద తేదీలు ప్ర‌క‌టిస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు.

ప్ర‌భుత్వానికి త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌నే ఉద్దేశం లేద‌ని, చ‌ర్చ‌ల పేరుతో కాలయాప‌న చేస్తూ తామే విసుగుపుట్టి  ఆందోళ‌న విర‌మించేలా చేయాల‌నేది ప్ర‌భుత్వ కుట్ర అని హ‌న‌న్ మొహ‌ల్లా ఆరోపించారు. కాగా, శాంతియుతంగా జ‌రుగుతున్న త‌మ‌ ఆందోళ‌న‌ను కొంద‌రు ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుదారులు హింస‌పూరితంగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని హ‌ర్యానా కిసాన్ సంఘ‌ర్ష్ స‌మితి క‌న్వీన‌ర్ మ‌న్‌దీప్ న‌త్వాన్ విమ‌ర్శించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo