సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:47:06

మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు? : సుప్రీంకోర్టు

మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు? : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : దేశా రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదే సమయంలో ఐఐటీ బొంబాయిని తీవ్రంగా హెచ్చరించింది. మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పండని ప్రశ్నించింది. మీ న్యూసెన్స్ ను ఇంకా సహించలేమంటూ తీవ్రంగా ఆక్షేపించింది. 

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి "పొగమంచు టవర్" ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రాజెక్టు నుంచి వైదొలగాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, ధిక్కార చర్యల గురించి సుప్రీంకోర్టు బుధవారం మధ్యాహ్నం ఐఐటీ బొంబాయిని హెచ్చరించింది. ఐఐటీ బొంబాయి, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధికారులు సైట్ సందర్శించి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా జనవరిలో ముసాయిదా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఆరు నెలల తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నందుకు సంస్థను "శిక్షించాల్సిందే" అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. 

"ఈ అర్ధంలేని దాన్ని నేను సహించలేను. కోర్టు ఆదేశాలను ఆలస్యం చేసినందుకు ఐఐటీ బొంబాయి, ఇతర అధికారులను శిక్షిస్తాం. ఆరు నెలల తర్వాత వారు ఎలా వెనక్కి వస్తారు? ప్రభుత్వ ప్రాజెక్ట్ నుంచి వారు ఎలా వెనక్కి వెళ్ళగలరు? నేను వారిపై ధిక్కార కేసును తీసుకుంటాను" అని జస్టిస్ అరుణ్ మిశ్రా హెచ్చరించారు.

సొలిసిటర్ జనరల్ పై ఆగ్రహం వ్యక్తంచేసిన జస్టిస్ మిశ్రా.. మొదట ఐఐటీ బొంబాయి నుంచి ప్రత్యుత్తరం ఇవ్వమని, తొలుత 30 నిమిషాల్లో అని, ఆ తరువాత 15 నిమిషాల్లోపు అని.. చివరకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో స్మోగ్ టవర్ ఏర్పాటు చేయడానికి గత ఏడాది డిసెంబర్‌లో ఉన్నత న్యాయస్థానం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ సమయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద టవర్ ఏర్పాటు చేయడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దాదాపు తొమ్మిది నెలల సమయం అవసరమని ఢిల్లీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. ఆ సమయంలో ఒక ఐఐటీ ప్రొఫెసర్ సంప్రదించగా.. టవర్లు,యాంటీ స్మోగ్ గన్స్ ఏర్పాటు 2020 ఆగస్టు నాటికి సాధ్యమవుతుందని చెప్పారు. 

ఈ ప్రాజెక్టు కోసం రూ.18.52 కోట్ల నిధులు మంజూరయ్యాయి.


logo