ఆదివారం 29 మార్చి 2020
National - Feb 15, 2020 , 16:04:03

ఇలాంటి ఏకాగ్రతే కావాల్సింది... వీడియో

ఇలాంటి ఏకాగ్రతే కావాల్సింది... వీడియో

భువనేశ్వర్‌ : ఏకాగ్రత... ఒకే పనిమీద తమ దృష్టినంతా కేంద్రీకరించడం. ఏదైనా పనిచేసేటప్పుడు ఇష్టంగా దానిమీదే దృష్టిని ఉంచడం. మన బలం రహస్యం ఏకాగ్రతలో దాగుందంటారు. మనస్సును నిశ్చలంగా చేసే పనిపై ఏకాగ్రంగా నిలిపితే కార్యాలన్నీ సఫలమౌతాయంటారు. ఏకాగ్రతతో ఏ పనినైనా అదే పనిగా చేస్తే సాధించలేనిదంటూ ఉండదంటారు. నాటి పురాణేతిహాసాల నుండి నేటి నవీన కాలంలోని మైండ్‌ మేనేజ్‌మెంట్‌ గురువుల వరకు అటువంటి ఏకాగ్రత ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్న కథలెన్నో మనకు తెలుసు. ఇందుకు ఉదాహరణగా అన్నట్లు ఒడిశా పోలీస్ అధికారి అరుణ్‌ బోత్రా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఏదో సభ ప్రారంభానికి ముందు నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేదికపై ఓ యువతి డాన్స్‌ చేస్తుంటుంది. వ్యాఖ్యాతలు స్టేజిపైనా వేసిన కూర్చీలపై కూర్చుంటారు. అంతే కూర్చీలు స్టేజీ చివరి అంచున ఉండటంతో వారు పట్టుతప్పి ఒక్కసారిగా కిందపడిపోతారు. ఆ సమయంలో అది చూసిన ఎవరైనా ఏం చేస్తారు. తక్షణమే స్పందించి కిందపడ్డవారిని లేపేందుకు ప్రయత్నిస్తారు. కానీ స్టేజీపై డ్యాన్స్‌ చేసే యువతి మాత్రం పడిపోయినవారిని అలా ఒక్క క్షణకాలం పాటు చూసి ఏం జరగనట్టుగా తిరిగి తన డ్యాన్స్‌ను కొనసాగించింది. నవ్వుల పువ్వులు పూయించేలా ఉన్న ఈ వీడియోను అరుణ్‌ బోత్రా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ ఇటువంటి ఏకాగ్రతే తన జీవితంలో కావాల్సింది అంటూ పేర్కొన్నాడు.


logo