గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 02:07:53

ఇది నా జీవితం.. నా ముఖం

ఇది నా జీవితం.. నా ముఖం
  • ట్రోల్స్‌పై శృతిహాసన్‌ మండిపాటు

చెన్నై: ‘చాలా సన్నగా మారిపోయింది’.. ‘ఈ ఫొటోలో వయసైపోయినట్టు కనిపిస్తున్నది’ అంటూ గత కొంతకాలంగా తనపై వస్తున్న వార్తలపై ప్రముఖ నటి శృతిహాసన్‌ స్పందించారు. ఎదుటివాళ్లపై తీర్పులు చెప్పే అధికారం ఎవరికీ లేదని మండిపడ్డారు. ఇది తన జీవితమని, నచ్చినట్టు కనిపించే హక్కు తనకున్నదని తెలిపారు. మన శరీరంలో వచ్చే మార్పులను స్వాగతిస్తే ప్రశాంత జీవనం గడుపవచ్చని హితవు పలికారు. తాను హార్మోన్‌ సమస్యలతో బాధ పడుతున్నానని.. అందుకే తన రూపంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్న శృతి.. తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్టు వెల్లడించారు. ఈ విషయాల్ని తన ఇన్‌స్టాగ్రావ్‌ులో పోస్టు చేశారు. దీంతోపాటు రెండు ఫొటోలను కూడా షేర్‌ చేశారు. 


logo