సోమవారం 25 జనవరి 2021
National - Jan 05, 2021 , 12:03:50

ఇది దేశానికి ఎంతో ముఖ్య‌మైన రోజు: ప‌్ర‌ధాని మోదీ

ఇది దేశానికి ఎంతో ముఖ్య‌మైన రోజు: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: కొచ్చి-మంగ‌ళూరు మ‌ధ్య నిర్మించిన న్యాచుర‌ల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉన్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. ఇది దేశానికి ఎంతో ముఖ్య‌మైన రోజు అని.. ప్ర‌త్యేకించి కేర‌ళ, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు చాలా ముఖ్య‌మైన రోజు అని పేర్కొన్నారు.  ఈ ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా న్యాచుర‌ల్ గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

గ‌తంలో కొన్ని ద‌శాబ్దాలుగా దేశం ఏ మేర‌కు అభివృద్ధి చెందిన‌ది అనే విష‌యంలో తానేమీ మాట్లాడ‌దలుచుకోలేద‌ని, కానీ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా మాత్రం దేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ద‌ని ప్రధాని మోదీ చెప్పారు. కేర‌ళ‌లోని కొచ్చి నుంచి క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు వ‌ర‌కు ఈ గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ.3,000 కోట్లు వ్య‌యం చేశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo