బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 16:06:22

ఇది గార్గిల్‌ చేసే పక్షి.. వైరల్‌ వీడియో..

ఇది గార్గిల్‌ చేసే పక్షి.. వైరల్‌ వీడియో..

హైదరాబాద్‌: గొంతునొప్పిగా ఉంటే మనం ఏం చేస్తాం. కొన్ని ఉప్పునీళ్లను తీసుకొని గార్గిల్‌ చేస్తాం. అదేనండి పుకిలించి ఊమడం. కరోనా నేపథ్యంలో ఈ గార్గిల్‌ అందరికీ పరిచయమైంది. ఇదిలా ఉంటే, ఓ పక్షి గార్గిల్‌ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. పక్షి అచ్చు మనలా తలపైకెత్తి గార్గిల్‌ చేస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ నెటిజనం సంబురపడిపోతున్నారు. ఈ కింద గార్గిల్‌ చేస్తున్న ఆ పక్షి వీడియోను మీరూ చూసేయండి..


logo