మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 22:06:33

ఏనుగుని దేవుడిగా భావించి పూజలు చేస్తారని తెలుసా?

ఏనుగుని దేవుడిగా భావించి పూజలు చేస్తారని తెలుసా?

కోయంబత్తూరు : తమ పంటలు దెబ్బతిస్తున్నాయని ఏనుగులను తరిమికొట్టే వారున్నారు.. కొందరు వెంటపడి గాయపరిచేవారున్నారు.. కానీ దేవుడిగా భావించి పూజించే వారున్నారని తెలుసా? కేరళ కోయంబత్తూరులోని సిరుముగై సమీపంలో కందవయాల్‌ గ్రామస్తులు దేవుడిగా పూజలు చేస్తున్నారు.  కోయంబత్తూర్‌ కందవయాల్‌లోని ఓ సమూహానికి చెందిన గిరిజన ప్రజలు ఏనుగును దేవుడిగా పూజించే పద్ధతిని శతాబ్దానికిపైగా అనుసరిస్తున్నారు.  గ్రామంలోని భాగవతి అమ్మన్‌ ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పూజిస్తే ఏనుగులు తమ పంటలకు నష్టం కలిగించవని ప్రజలు నమ్ముతారు.  ఆలయంలో భాగవతి అమ్మన్‌ గిరిజనుల ప్రధాన దైవంగా ఉండగా, తూర్పునకు అభిముఖంగా కొలువై ఉండగా,  అడవి ఉన్న ఉత్తరానికి ఎదురుగా ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

రెండు ఎకరాల భూమిని కలిగి ఉన్న అమసాయి అలియాస్ ఎం చిన్ను మీడియాతో మాట్లాడుతూ ఇది కందవయాల్‌ ప్రజలు మాత్రమే కాదు.. సమీపంలోని ధమ్మర్యంపాలయం, సిరుముగై ప్రజలు కూడా తమ పంటలతో ఆలయానికి వచ్చి తమ పంటను ఏనుగుకు  విగ్రహానికి అంకితం చేస్తున్నారన్నారు. పూర్వం కందవయాల్‌, పరిసర ప్రాంతలు వరిపొలాలు ఉన్నందున ఏనుగులు తమ తమ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఈ ఏనుగు దేవుడిని ప్రార్థిస్తారు. ‘మానవులు ఏనుగులను ఇబ్బంది పెట్టకపోతే, జంతువు ఎవరినీ బాధించదని మా పూర్వీకులు మాకు చెప్పారు. ఏనుగులు తెలివైన జంతువులు.. మనుషుల మాటలను సులభంగా పాటించేందుకు మేము విగ్రహాన్ని అభ్యర్థించినప్పుడల్లా అడవికి తిరిగి రావడానికి  వీలు కల్పిస్తుంది’ అని చిన్నూ చెప్పాడు.

మరో గ్రామస్తుడు ఆర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ.. ఏనుగు విగ్రహాన్ని టన్నుకుపైగా బరువున్న  ఒకే రాయితో తయారు చేశామని, భూమిలే ఎనిమిది అడుగుల రంధ్రం తవ్వడం ద్వారా రెండు పొరల స్లాబ్ రాయిపై దీన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ‘అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేసే వారు. నాలుగేళ్ల క్రితం భాగవతి అమ్మన్‌ ఆలయంలో కుంభాభిషేకం కూడా చేశారు’ అని ఆయన అన్నారు. ఇది కంధవయాల్లో మాత్రమే కాదు.. అనైకట్టి సమీపంలోని పనిపట్టి గ్రామానికి చెందిన గిరిజనులు శివరాత్రి సమయంలో పుర్తస్సీ తమిళ నెలలో రాతి ఏనుగు విగ్రహానికి పూజలు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo