మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 16:10:02

యజమానిని చూడగానే కంటతడి పెట్టుకున్న గాడిద : వీడియో వైరల్‌

యజమానిని చూడగానే కంటతడి పెట్టుకున్న గాడిద : వీడియో వైరల్‌

సోషల్‌మీడియా ద్వారా ఎక్కడ ఏం జరుగుతున్నా వెంటనే తెలిసిపోతున్నది. వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలను మొదట చూడగానే ఏముందిలే అనుకున్నవాళ్లు క్లైమాక్స్‌కి రాగానే కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ వీడియో కూడా అలాంటిదే.

లాక్‌డౌన్‌ కారణంగా స్పెయిన్‌కు చెందిన ఇస్మాయిల్‌ గాడిదను పెంచుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. యజమానికి కరోనా సోకిందని అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. దీంతో గాడిద ఒంటరై పోయింది. చేసేదేంలేక గాడిద ఒక్కటే ఎలా ఉందో అనుకుంటూ హాస్పిటల్‌లోనే గడిపాడు యజమాని. రెండు నెలల తర్వాత కరోనా నెగటివ్‌ రావడంతో అతనిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. తీరా ఇంటికి వచ్చేసరికి గాడిద కనబడక పోవడంతో ఓనర్‌కి పిచ్చిపట్టినట్లైంది. గాడిద కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడా కనిపించకపోవడంతో పొలాల వైపు అరుస్తూ వెతుకుతున్నాడు. యజమాని మాటలు విన్న గాడిద అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్‌ అంటూ యజమాని తలపై నిమరడంతో గాడిదకు ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఊరుకో నేను వచ్చేశాగా అంటూ గాడిదను బుజ్జగిస్తున్న వీడియోను ఇస్మాయిల్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. logo