ఆదివారం 17 జనవరి 2021
National - Jan 01, 2021 , 21:28:09

ప్రాణదాత‌ల‌ను అందిస్తున్న "యూబ్ల‌డ్" యాప్

ప్రాణదాత‌ల‌ను అందిస్తున్న

బెంగళూరు :ఒక వ్య‌క్తి దానం చేసే ఒక్క యూనిట్‌ రక్తం మరో ముగ్గురికి ప్రాణాలు పోస్తుంది. అయితే, క‌రోనా ప‌రిస్థితుల త‌ర్వాత‌ గతంలో ఎన్నడూ లేని విధంగా బ్లడ్‌ బ్యాంకులో రక్త నిల్వలు తగ్గిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దేశంలో సగం మందికి సకాలంలో ర‌క్తం అందడం లేదు. ఈ సమస్య ను పరిష్కరించేందుకు, ర‌క్త‌దాతలు-ర‌క్త గ్రహీతల మ‌ధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఓ యాప్ వచ్చేసింది.అదే "యూబ్ల‌డ్" యాప్.

వైరస్‌ వ్యాప్తి కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం, రక్తదానం చేసేందుకు స్వచ్ఛంద దాతలు దవాఖానలకు వెళ్లకపోవడంతో ఆపదలో ఉన్న వారికి రక్తం అందడంలేదు. దీంతో అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ, బ్లడ్‌ బ్యాంకుల్లోనూ రక్తం కొరత ఏర్పడింది. దీన్ని నివారించేందుకు 'యూబ్ల‌డ్' పేరుతో ప్రారంభించారు. 'యూబ్ల‌డ్' యాప్ ఆండ్రాయిడ్ bit.ly/ublood ,ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట‌ర్ అవ్వాలి. ఈ యాప్‌లో ర‌క్తదానం చేయాల‌నుకున్నవారి వివ‌రాలు ఉంటాయి. అలాగే ర‌క్తం కావాల్సిన వారు ఈ యాప్‌ ద్వారా వారి వివ‌రాలు పొంది స‌హాయం కోర‌వ‌చ్చు.సకాలంలో రక్తం అందించేందుకు "యూబ్ల‌డ్" యాప్ ప్రాణదాతలను అందిస్తున్నది.