ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:13:22

హోంక్వారంటైన్‌లోకి తిరువనంతపురం మేయర్‌

హోంక్వారంటైన్‌లోకి తిరువనంతపురం మేయర్‌

తిరువనంతపురం : దేశంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ్వరిని మహమ్మారి వదలడం లేదు. తాజాగా కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు కరోనా బారినపడ్డారు. దీంతో నగర మేయర్‌ కె.శ్రీకుమార్ శుక్రవారం హోంక్వారంటైన్‌లోకి  వెళ్లారు. ఈ మేరకు ఓ మున్సిపల్ అధికారికి ఆయన సమాచారం అందించారు.

ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని మేయర్‌ పేర్కొన్నారని తెలిపారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 16,110 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి 9,466 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 6,594 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 50మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.


logo