శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 18, 2020 , 19:39:18

ఆ జిల్లా తీర ప్రాంతాల్లో 10 రోజులు క‌ఠిన లాక్‌డౌన్!‌

ఆ జిల్లా తీర ప్రాంతాల్లో 10 రోజులు క‌ఠిన లాక్‌డౌన్!‌

తిరువ‌నంత‌పురం: కేర‌ళ తీర‌ప్రాంతాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. దీంతో తీర ప్రాంతాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి స్థానిక అధికారులు త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. తాజాగా తిరువ‌నంత‌పురం తీర ప్రాంతాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఆ జిల్లా క‌లెక్టర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జిల్లాలోని స‌ముద్ర తీర ప్రాంతాల‌ను మూడు క్రిటికల్ కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభ‌జించారు. 

ఆ మూడు జోన్‌ల‌లో జూలై 18 అర్థ‌రాత్రి నుంచి జూలై 28 వ‌ర‌కు ప‌ది రోజుల‌పాటు క‌ఠిన లాక్‌డౌన్ విధించిన‌ట్లు తిరువ‌నంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ స్ప‌ష్టంచేశారు. ఈ 10 రోజులపాటు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వ‌ని, క‌ఠిన లాక్‌డౌన్ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని చెప్పారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ సామూహిక వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం తాజా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు.          

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo