శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 16:23:21

నిరాశ్రయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

నిరాశ్రయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కరోనావైరస్ వ్యాప్తిని నివారించడంపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పూర్తిస్థాయి దృష్టి పెట్టారు.  పేదలతోపాటు వీధుల్లో సంచరించే నిరాశ్రయులకు సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా నిరుపేదలను, నిరాశ్రయులను గుర్తించి వాహనాల్లో క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకువచ్చి పరీక్షిస్తున్నారు.
నగరంలోని అట్టకులంగర పాఠశాలను నిరాశ్రయుల క్వారంటైన్‌ కేంద్రంగా మార్చామని మేయర్ కె. శ్రీకుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 18,098 కరోనా కేసులు నమోదయ్యాయి. 9,428 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 8,611 మంది మహమ్మారి బారిపడి కోలుకున్నారు. ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 59 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.


logo