శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 13:15:47

వ‌రి నాటు వేసిన ఐపీఎస్ అధికారి.. వీడియో

వ‌రి నాటు వేసిన ఐపీఎస్ అధికారి.. వీడియో

అమ‌రావ‌తి: లాక్‌డౌన్ విధుల‌తో బిజీబిజీగా ఉన్న తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ ఆవుల ర‌మేశ్ మంగ‌ళ‌వారం రైతుల‌తో క‌లిసి వ‌రినారు తీశారు. ఎస్పీ వ‌రి నారు తీయడం ఏంటి అనుకుంటున్నారా..?  కానీ ఇది నిజ‌మండి. తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ ర‌మేశ్ లాక్‌డౌన్ విధుల్లో భాగంగా యెర్పేడు-వెంక‌ట‌గిరి రోడ్డులో వెళ్తుండ‌గా రోడ్డు ప‌క్క‌న పొలాల్లో రైతులు ప‌నిచేస్తూ క‌నిపించారు. దీంతో వాహ‌నం ఆపి వారి ద‌గ్గ‌రికి వెళ్లిన ఎస్పీ ర‌మేశ్.. క‌రోనా మ‌హ‌మ్మారి విస్తరిస్తున్నందున ఇలా గుంపులుగా ప‌నిచేస్తున్న‌ప్పుడు మాస్కులు ధ‌రించాల‌ని సూచించారు. 

వారితో కాసేపు వ్య‌వ‌సాయం గురించి ముచ్చ‌టించారు. అంతేకాదు వారితో క‌లిసి కాసేపు స‌ర‌దాగా ప‌ని కూడా చేశారు. వ‌రి నారు తీశారు! నాటు వేశారు! బుర‌ద మ‌డిలో నాగ‌లి దున్నారు! ఒక ఎస్పీ స్థాయి అధికారి త‌మ‌తో క‌లిసి ప‌ని చేయ‌డంప‌ట్ల అక్క‌డి రైతులు, రైతు కూలీలు సంతోషం వ్య‌క్తం చేశారు. కాగా ఎస్పీ ర‌మేశ్ అక్క‌డి నుంచి తిరిగి వెళ్తూ ఎప్పుడు గుంపులుగా ప‌నిచేసినా మాస్కులు ధ‌రించాల‌ని, ఒక‌రికి ఒక‌రు రెండు మీట‌ర్ల దూరం పాటించాల‌ని రైతుల‌కు సూచించారు. వారికి అధికారుల నుంచి ఏదైనా సాయం అవ‌స‌రమైతే నిర్మొహ‌మాటంగా అడుగ‌వ‌చ్చ‌ని‌ భ‌రోసా ఇచ్చారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo