సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:39:44

ద‌య‌చేసి కొంచెం వాట‌ర్ పోస్తారా..? ఓ ఉడుత విన్న‌పం!

ద‌య‌చేసి కొంచెం వాట‌ర్ పోస్తారా..? ఓ ఉడుత విన్న‌పం!

వ‌ర్షాలు మొద‌లైన‌ప్ప‌టికీ ఎండ‌లు విప‌రీతంగా కాస్తున్నాయి. ఎన్ని నీళ్లు తాగుతున్నా బాడీ డీహైడ్రేట్‌కు గుర‌వుతున్న‌ది. దీని ఫ‌లితంగా శ‌రీరంలో వేడి అధికంగా ఉంటుంది. ఇది మ‌నుషులు ప‌రిస్థితి. మరి పాపం ప‌క్షులు, జంతువుల మాటేమిటో ఒక్క‌సారైనా ఆలోచించారా?  పాపం ఈ ఉడుత ఎప్ప‌టి నుంచి దాహంగా ఉందో ఏమో.. చివ‌రికి ఒక వాట‌ర్ బాటిల్‌ని చూడ‌గానే చేతులెత్తి నీరు పోయ‌మంటున్న‌ది.

రోడ్డు మీదున్న ఉడుత‌కు ఒక మ‌నిషి చేతిలో ఉన్న వాట‌ర్ బాటిల్ క‌నిపించింది. అందులో నీరు క‌నిపించ‌డంతో పోయిన ప్రాణం లేచి వ‌చ్చిన‌ట్లు అయింది. ప్లీజ్ కొంచెం వాట‌ర్ పోయండంటూ అత‌న్ని ప్రాదేయ‌ప‌డింది. అంత విన‌యంగా అడిగితే ఎవ‌రైనా కాదంటారు. బాటిల్ మూత తీసి నీరు పోస్తే ఆ ఉడుత‌ దాహం తీర్చుకున్న‌ది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైర‌ల్‌గా మారింది.


logo