శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 08, 2020 , 20:22:11

వామ్మో.. చిలుక‌లు కూడా ఇలా చెట్టుమీద‌నే కొబ్బ‌రినీళ్లు తాగేస్తే పాపం య‌జ‌మానుల ప‌రిస్థితేంటి!

వామ్మో.. చిలుక‌లు కూడా ఇలా చెట్టుమీద‌నే కొబ్బ‌రినీళ్లు తాగేస్తే పాపం య‌జ‌మానుల ప‌రిస్థితేంటి!

టెంకాయ చెట్లు ఉన్న‌వాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. కాపు వ‌చ్చిన త‌ర్వాత కోతులు ఏక‌ధాటిగా దాడిచేస్తాయి. కొబ్బ‌రినీళ్లు తాగ‌డానికి కోతుల‌కు ఎలాంటి క‌త్తులు, క‌టార్లు అవ‌స‌రం లేదు. నోటితోనే అవ‌లీల‌గా తాగేస్తాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు టెంకాయ‌చెట్లు ఉన్న య‌జ‌మానులు కోతుల‌కే భ‌య‌ప‌డేవాళ్లు. ఇక‌పై రామ‌చిలుక‌ల‌కు కూడా భ‌య‌ప‌డాల్సిన రోజులు రోబోతున్నాయి. కొంచెం బ‌రువున్న వ‌స్తువునే ఎత్తిపెట్ట‌డానికి నానాతంటాలు ప‌డే చిలుక‌లు ఇప్పుడు చెట్టుపైనే టెంకాయ నీళ్లు తాగేస్తున్నాయి.

22 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. కొబ్బ‌రి నీళ్లంటే ఇష్ట‌ప‌డ‌నివారు ఎవ‌రుంటారు అనే శీర్షిక‌ను జోడించారు. దీంతోపాటు కొబ్బ‌రినీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు కూడా వివ‌రించారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 13 కే మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన త‌ర్వాత నెటిజ‌న్లు కామెంట్లు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.