ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 21:57:44

దొంగ‌త‌నానికి వెళ్తే.. చేప‌ల పులుసు దొరికింది! ఏం చేశాడంటే?

దొంగ‌త‌నానికి వెళ్తే.. చేప‌ల పులుసు దొరికింది! ఏం చేశాడంటే?

దొంగ‌త‌నం అంటే.. వెళ్లామా. స‌ర్దేశామా. అన్న‌ట్లుండాలి. అంతేకాని ఇంట్లో తిన‌డానికి ఏం ఉన్నాయి అంటూ వెత‌క్కూడ‌దు. తీరా క‌నిపించినా అలా క‌డుపునిండా తినేయ‌కూడ‌దు. తింటే ఇత‌ను దొరికిన‌ట్లుగా దొరికిపోతారు. త‌మిళనాడుకు చెందిన సతీష్ అనే యువకుడు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి దూరాడు. డ‌బ్బులు, న‌గ‌లు ఏవీ దొర‌క్క‌పోవ‌డంతో నిరాశ చెందాడు. ఇక తిరిగి వెళ్లిపోదాం అనుకొనేసరికి.. వంట‌గ‌దిలోని చేప‌ల కూర వాస‌న ర‌మ్మ‌ని పిలిచిన‌ట్లుంది.

డ‌బ్బులు, న‌గ‌లేం దొర‌క‌లేదు. దొరికిన చేప‌ల పులుసును ఎందుకు వ‌దులుకోవాలి అనుకున్నాడేమో.. ఓ ప‌ట్టు ప‌ట్టాడు. కడుపు నిండ‌డంతో ఆవ‌లింత‌లు మొద‌ల‌య్యాయి. హాయిగా ఉండ‌డంతో చ‌ల్ల‌గాలి కోసం టెర్ర‌స్‌పైకి వెళ్లాడు. ఇంకేముంది చ‌ల్ల‌గాలి వీస్తున్న‌ది. నిద్ర ముంచుకు రావ‌డంతో అక్క‌డే నిద్ర‌పోయాడు. నిద్ర‌మ‌త్తులో వ‌చ్చిన ప‌ని మ‌ర్చిపోయాడు. బారెడు పొద్దెక్కినా లేవ‌లేదు. ఇంతలో ఇంటి యజమాని వచ్చేశాడు. ఇంట్లో చూడ‌గానే ప‌రిస్థితి అంతా అర్థ‌మైంది. సీసీ కెమెరా చూస్తే పైన ఉన్న‌ట్లు తెలిసింది. స‌తీష్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాడు య‌జ‌మాని. logo