బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 15:46:54

క‌రోనా టైమ్‌లో రాహుల్‌గాంధీ, తేజ‌స్వియాదవ్ ఢిల్లీలో కూర్చున్నారు: జేపీ న‌డ్డా

క‌రోనా టైమ్‌లో రాహుల్‌గాంధీ, తేజ‌స్వియాదవ్ ఢిల్లీలో కూర్చున్నారు: జేపీ న‌డ్డా

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 7న తుది విడుత పోలింగ్ జ‌రుగ‌నున్నందున రేప‌టితో ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం లారియాలో ఎన్నిక‌ల ప్ర‌చారం స‌భ‌లో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీపైన‌, ఆర్జేడీ అగ్ర నాయ‌కుడు తేజ‌స్వియాద‌వ్‌పైన నిప్పులు చెరిగారు. బీహార్‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తుంటే రాహుల్‌గాంధీ, తేజ‌స్వియాదవ్ ఢిల్లీలో కూర్చున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. క‌రోనా మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డి వారు పోయార‌ని న‌డ్డా ఎద్దేవా చేశారు. 

అలాంటిది వాళ్లు ఇప్పుడు క‌రోనా క‌ట్ట‌డిలో బీహార్‌ ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌శ్నిస్తున్నార‌ని జేపీ న‌డ్డా మండిప‌డ్డారు. క‌రోనా స‌మ‌యంలో బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌జ‌ల బాగోగులు చూసుకున్నార‌ని న‌డ్డా చెప్పారు. బీహార్ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న ఆట‌విక రాజ్య రాకుమారుడు (తేజ‌స్వియాద‌వ్‌ను ఉద్దేశించి) ఒక్క‌సారి కూడా అసెంబ్లీకి హాజ‌రు కాలేద‌ని విమ‌ర్శించారు. అందువ‌ల్ల అతనికి విశ్రాంతినిచ్చి నితీశ్‌కుమార్‌కు ప‌ని క‌ల్పించండ‌ని జేపీ న‌డ్డా ఓట‌ర్ల‌ను కోరారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.