మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 22, 2020 , 18:19:14

వాళ్ల‌కు కొంద‌రంటె ప్రేమ‌.. ఐటీ నోటీసుల‌పై ప‌వార్ స‌ర‌దా వ్యాఖ్య‌

వాళ్ల‌కు కొంద‌రంటె ప్రేమ‌.. ఐటీ నోటీసుల‌పై ప‌వార్ స‌ర‌దా వ్యాఖ్య‌

  • ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్టుమెంటుపై ప‌వార్ స‌ర‌దా వ్యాఖ్య‌లు

ముంబై: ‌నేష‌నల్ కాన్ఫ‌రెన్స్ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌కు ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నోటీసులు జారీచేసింది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించిన‌ అఫిడ‌విట్‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ నోటీసుల‌లో కోరింది. శివ‌సేన అధినేత‌, ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక‌రే, ఆయ‌న కుమారుడు ఆదిత్య థాక‌రే, ఎన్సీపీకి చెందిన లోక్‌స‌భ స‌భ్యురాలు సుప్రియాసూలేల అఫిడ‌విట్‌ల‌తోపాటు శ‌ర‌ద్ ప‌వార్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో కూడా త‌ప్పుడు వివ‌రాల‌ను పొందుప‌ర్చార‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. 

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ గ‌త నెల సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు (సీబీడీటీ) ఫిర్యాదును ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఈ నేప‌థ్యంలో సీబీడీటీ ఇప్ప‌టికే ఉద్ద‌వ్ థాక‌రే, ఆదిత్య థాక‌రే, సుప్రియాసూలేల‌కు ఆఫిడ‌విట్‌ల‌పై వివ‌ర‌ణ కోరుతూ నోటీసులు పంపింది. తాజాగా మంగ‌ళ‌వారం శ‌ర‌ద్‌ప‌వార్‌కు కూడా ఇన్‌క‌మ్ ట్యాక్స్ నోటీసులు అందాయి. ఈ నోటీసులపై ప‌వార్ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. 'వాళ్లు కొంద‌రిని బాగా ప్రేమిస్తారు' అంటూ ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్టుమెంటును ఉద్దేశించి చ‌మ‌త్క‌రించారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.