శనివారం 28 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 14:59:45

వాళ్లేమీ గెలుపు గుర్రాలు కాదు: అన్నాడీఎంకే

వాళ్లేమీ గెలుపు గుర్రాలు కాదు: అన్నాడీఎంకే

చెన్నై: కాంగ్రెస్, డీఎంకే పొత్తుపై త‌మిళ‌నాడు రాష్ట్ర ‌మంత్రి, అన్నాడీఎంకే నాయ‌కుడు డీ జ‌య‌కుమార్ విమ‌ర్శ‌లు చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము సీట్ల కోసం డీఎంకేను అడుక్కోబోమ‌ని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మీ స్పంద‌న ఏమిట‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా.. వారేమీ గెలుపు గుర్రాలు కాద‌ని జ‌య‌కుమార్ వ్యాఖ్యానించారు. డీఎంకే, కాంగ్రెస్ మ‌ధ్య సంబంధాలు అంత బాగా ఏమీ లేవ‌నడానికి కాంగ్రెస్ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.