సోమవారం 18 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:03:30

వాళ్లు ఉగ్రవాదులు కాదు.. రైతులే: సంజయ్‌ రౌత్‌

వాళ్లు ఉగ్రవాదులు కాదు.. రైతులే: సంజయ్‌ రౌత్‌

ముంబై: కేంద్ర ప్రభుత్వం రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నదని శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీ మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో పంజాబ్‌, హర్యానా నుంచి రైతులు పెద్దఎత్తున ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నారు. అయితే రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆపిన విధానం చూస్తే ప్రభుత్వం వారిని ఈ దేశానికి చెందినవారిలా చూస్తున్నట్లు కన్పించడం లేదని విమర్శించారు. రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని విమర్శించారు. ఎందుకంటే అక్కడికి వచ్చినవారంతా సిక్కులు కావడం, అందులోనూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రావడంతో వారిని ఖలిస్తానీ అని పిలుస్తున్నారని ఆరోపించారు. ఇది రైతులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.   


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ మార్చ్‌కి పిలుపునిచ్చిన్నారు. దీంతో గురువారం పంజాబ్‌, హర్యానాకు చెందిన రైతులు పెద్దఎత్తున ఢిల్లీకి బయల్దేరారు. అయితే వారు ఢిల్లీకి రాకుండా హరియానా సరిహద్దుల్లోనే అడ్డుకున్న పోలీసులు వారిపై వాటర్‌ క్యానన్లు, భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో టీక్రీ సరిహద్దుల్లో బురారి వద్ద ఉన్న నిరంకారి స్టేడియంలో నిరసన చేపట్టడానికి ప్రభుత్వం వారికి అనుమతించింది. అయితే రైతులు అక్కడ నిర‌స‌న తెల‌ప‌డానికి నిరాక‌రిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.