ఆదివారం 31 మే 2020
National - May 20, 2020 , 16:38:22

కరోనా మాస్కులకు వారు కళాత్మకత జోడించారు

కరోనా మాస్కులకు వారు కళాత్మకత జోడించారు

పట్నా: కోవిడ్-19 నుంచి ఇప్పుడప్పుడే విముక్తి లేదు కనుక జనాలు మాస్కులకు అలవాటు పడుతున్నారు. మాస్కు అనగానే ఏదో ఇంత గుడ్డముక్క మూతికి అడ్డంగా కట్టుకుంటే చాలని కొందరు అంటారు. మరికొందరు అవి కొంచెం అందంగా.. కళాత్మకంగా ఉంటే బాగుంటుందని భావిస్తారు. అలాంటివారి కోసమే బీహార్‌కు చెందిన జానపద కళాకారులు మధుబని, మంజూష శైలి పెయింటింగ్ లతో కరోనా మాస్కులు తయారు చేసి అమ్ముతున్నారు. మదుబని సైలిలో ఎక్కువగా చేపలు, పక్షులు, పశువులు, సూర్యచంద్రుల వంటివి ఉంటాయి. గుండరి కళ్లు కొనదేరిన ముక్కు వీటి ప్రత్యేకత.

ఇక మంజూష శైలిలో వరుస చిత్రల ద్వలారా కథ తెప్పడం వంటివి ఉంటాయి. మంజూష శైలి భాగల్పూర్ జిల్లాలో 7వ శతాబ్దిలో ఆవిర్భవించిందని అంటారు. ఈ బొమ్మల మాస్కులు రూ.80-100కు అమ్ముతున్నారు. ఫ్యాషన్ స్టేట్‌మెంటుగా ఉంటాయని వినియోగదారులు వీటిని కొంటున్నారు. అర్మానీ వంటి సుప్రసిద్ధ ఫ్యాషన్ కంపెనీలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాస్కులు అమ్ముతున్నాయి. అందులో ఈ బీహార్ కళాత్మక మాస్కులు మేమేం తక్కువ తిన్నామా అంటూ పోటీపడుతున్నాయి.


logo