మంగళవారం 26 జనవరి 2021
National - Jan 13, 2021 , 10:18:34

వాళ్ల ఆందోళ‌న దేనికో వాళ్ల‌కే తెలియ‌దు: ‌హేమ‌మాలిని

వాళ్ల ఆందోళ‌న దేనికో వాళ్ల‌కే తెలియ‌దు: ‌హేమ‌మాలిని

న్యూఢిల్లీ: ‌కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను ఉద్దేశించి అల‌నాటి బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు (ఆందోళ‌న చేస్తున్న రైతులు) దేని కోసం ఆందోళ‌న చేస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో కూడా వాళ్ల‌కు తెలియ‌దని ఆమె వ్యాఖ్యానించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌వ‌ల్ల స‌మ‌స్య ఏముందో కూడా వాళ్ల‌కు తెలియ‌దన్నారు. దీన్నిబ‌ట్టి రైతుల ఆందోళ‌న స్వచ్ఛంద‌మైన కాద‌ని, ఎవ‌రో చేయిస్తే వాళ్లు చేస్తున్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ద‌ని హేమ‌మాలిని పేర్కొన్నారు. హేమ‌మాలిని ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర పార్ల‌మెంట్ స్థానం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.     ‌‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo