మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 19:25:18

ఈ స్కిల్స్ ఉంటే క‌రోనా టైంలో కూడా ఫుల్ డిమాండ్‌

ఈ స్కిల్స్ ఉంటే క‌రోనా టైంలో కూడా ఫుల్ డిమాండ్‌

క‌రోనా వ‌చ్చి రాగానే ఉద్యోగుల‌ జీవితాల్లో కొర‌త తీసుకొచ్చింది. ఎంత టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగాలు ఉంటాయో లేదో అన్న భ‌యం ప్ర‌తిఒక్క‌రిలో మొద‌లైంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై తీవ్రంగా పడింది. కొన్ని కంపెనీలు ఉద్యోగాలు తీసేస్తుంటే మ‌రికొన్ని కంపెనీలు జీతాల్లో కోత విధిస్తున్నారు. వేరే చోట ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిద్దామ‌న్నా అన్నిచోట్ల అదే ప‌రిస్థితి. ఉద్యోగం లేక ఇంట్లో ఖాళీగా ఉండ‌లేని ప‌రిస్థితి ఎదుర‌వుతున్న‌ది. 

ఇలాంటి స‌మ‌యంలో త‌మ జాబ్ ప‌దిలంగా ఉండేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ఉద్యోగులు. క‌రోనా టైంలో కూడా ఈ స్కిల్స్ ఉన్న‌వారికి మంచి డిమాండ్ ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్‌, నెట్‌వ‌ర్క్‌, ఆర్కిటెక్ట్‌, ఫుల్ స్టాక్ డెవ‌ల‌ప‌ర్స్‌, డేటా సైంటిస్ట్స్‌, ఆగ్యుమెంటెడ్ అండ్ వ‌ర్చువ‌ల్ రియాల్టీ ఎక్స్‌ప‌ర్ట్స్ లాంటి స్కిల్స్ ఉన్న‌వారికి ఇప్పుడు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఇంకేం.. ఈ స్కిల్స్‌లో ప‌ట్టుసారించి మీ ఉద్యోగాన్ని కాపాడుకోండి.


logo