శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 10:49:39

బాబు ఐదేళ్ల పాలనలో ఇవే బాగుపడింది : ఎంపీ విజయసాయి రెడ్డి

బాబు ఐదేళ్ల పాలనలో ఇవే బాగుపడింది : ఎంపీ విజయసాయి రెడ్డి

అమరావతి : చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా విజయసాయి రెడ్డి స్పందిస్తూ... బాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, జన్మభూమి కమిటీలు, ఇసుక మాఫియా మాత్రమే బాగుపడిందని అన్నారు. రూ. 2.5 లక్షల కోట్ల రుణాలు, రూ. 60 వేల కోట్ల కాంట్రాక్టర్ల బకాయిలు, రూ. 20 వేల కోట్ల కరెంటు అప్పు వదిలిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పేద ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వడానికి బాబుకు మనసొప్పలేదన్నారు. గ్రాఫిక్స్‌ను దాటి ఒక్క పని కూడా క్షేత్రస్థాయిలో పూర్తికాలేదని పేర్కొన్నారు.


logo