సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 21:56:44

వీరే నిజమైన రామభక్తులు!

వీరే నిజమైన రామభక్తులు!

రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రమ్నమి అనే విభాగానికి చెందిన వారిని నిజమైన రామభక్తులుగా పేర్కొనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. వీరికి శ్రీరాముడిపై అచంచలమైన విశ్వాసం ఉంది. వీరు ఆలయంలో పూజలు చేయరు. విగ్రహారాధనపై వీరికి పెద్దగా నమ్మకం లేదు. బదులుగా శ్రీరాముడి పేరును శరీరమంతా పచ్చ పొడిపించుకుంటారు. అంతేకాదు ఇండ్ల గోడలపై, తలుపులు, కిటికీల మీద ప్రతిచోటా శ్రీరాముడి పేరు కనిపించేలా చేస్తారు.

ఈ సంప్రదాయం చెడును ఎదుర్కోవటానికి ఎన్నో సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్ లో ప్రారంభమైంది. రమ్నమి విభాగానికి చెందిన మెహతార్ లాల్ టాండన్ వయసు 76 ఏండ్లు. 'నేను గత 54 ఏండ్ల క్రితం అయోధ్యలోనే రామ్ అని శరీరంపై పచ్చ వేయించుకున్నాను. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. రామనవమి రోజున అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ ఒక పూజారి నా ముఖం మీద రామ్ అని రాశారు' అని మెహతార్ చెప్పారు.

ఒక వర్గం వారిని గుడిలోకి రానివ్వకపోవడంతో వారు అలా శరీరంపై రామ్ అని పచ్చ వేసుకోవడం మొదలెట్టారనే కథ కూడా ప్రచారంలో ఉన్నది. అందుకనే వీరు తమ దేహాన్ని దేవాలయంగా భావిస్తారని చెప్తుంటారు. రమ్నమి విభాగంలో ప్రస్తుతం 400-500 మంది ఉన్నట్లు సమాచారం. చార్పారా గ్రామంలో పరశ్రాం అనే దళిత యువకుడు 1890 లో రమ్నమిని ప్రారంభించారని అక్కడి వారు చెప్తుంటారు. ఆలయానికి వెళ్లడం, విగ్రహాన్ని పూజించే బదులుగా రోజంతా రాముడి స్వరం వింటూనే ఉంటామంటారు వీరు. అందుకే వీరిని నిజమైన రామభక్తులుగా చెప్పుకోవచ్చు.



logo