గురువారం 28 జనవరి 2021
National - Dec 30, 2020 , 17:23:50

అవన్నీ ఒట్టి మాటలే: బీహార్ సీఎం

అవన్నీ ఒట్టి మాటలే: బీహార్ సీఎం

ప‌ట్నా: జేడీయూ ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నాంటూ ఆర్జేడీ నేత శ్యామ్ ర‌జాక్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీయూ సీనియ‌ర్‌ నేత నితీశ్‌కుమార్ తోసిపుచ్చారు. అవ‌న్నీ ఒట్టి మాట‌లేన‌ని కొట్టిపారేశారు. జేడీయూ నుంచి 17 మంది కాదు క‌దా ఒక్క‌రు కూడా ఆర్జేడీలోకి వెళ్ల‌బోర‌ని తేల్చిచెప్పారు. ఈ మ‌ధ్యాహ్నం ఆర్జేడీ నేత శ్యామ్ ర‌జాక్ మీడియాతో మాట్లాడుతూ.. జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పారు.

ఏ క్ష‌ణ‌మైనా ఆ 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ర‌జాక్ వ్యాఖ్యానించారు. అయితే, తాము మొత్తం 28 మంది గ్రూప్‌గా రావాల‌ని వారికి సూచించామ‌ని, అతి త్వ‌ర‌లోనే వారి సంఖ్యాబ‌లం 28కి చేరుకుంటుంద‌ని, ఆ రోజుతో నితీశ్ స‌ర్కారు కుప్ప‌కూలుతుంద‌ని ర‌జాక్ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని మీడియా ప్ర‌తినిధులు నితీశ్‌కుమార్ ముందు ప్ర‌స్తావించ‌గా.. అవి నిరాధార వ్యాఖ్య‌ల‌ని కొట్టిపారేశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo