న్యూఢిల్లీ, జూన్ 23: గూగుల్ ఫిట్‌బిట్, యాపిల్ చేతి గడియారం లాగే పర్డ్యూ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్మార్ట్ దుస్తులను తయారు చేశారు. ఈ దుస్తులు గుండె వేగాన్ని, బీపీని తెలియజేస్తాయి. దుస్తుల్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, సెన్సర్లు ఉంటాయి. ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లకు కూడా దుస్తులను కనెక్ట్ చేయవచ్చు. వీటిని చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. వైఫై, రేడియో తరంగాల ద్వారానే ఈ దుస్తులు రీచార్జ్ అవుతాయి.