గురువారం 03 డిసెంబర్ 2020
National - Sep 24, 2020 , 14:33:13

బంగారం డిమాండ్‌కు కార‌ణాలు ఇవే...!

బంగారం డిమాండ్‌కు కార‌ణాలు ఇవే...!

హైదరాబాద్ : భార‌త బంగారం మార్కెట్ మొదలైన క్ర‌మం, కొత్త‌ద‌నం పైన ప్ర‌పంచ బంగారు మండ‌లి(వ‌రల్డ్ గోల్డ్ కౌన్సిల్) ఓ అధ్యయనాన్ని ప్ర‌చురించింది. భార‌త‌దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌కు సంబంధించి ఈ నివేదిక‌లో కార‌ణాల‌ను పేర్కొన్నారు. వివాహ సంద‌ర్భాలు 24శాతం, పుట్టిన రోజు వేడుక‌లు15శాతం మ‌త‌ప‌ర‌మైన వేడ‌క‌లు అంటే పండుగ‌లు 12శాతం వంటి మూడు ముఖ్య కార‌ణాల రీత్యా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా బంగారం కొనుగోలు చేస్తున్నార‌ని ఈ నివేదిక తెలిపింది. 1990-2015 మ‌ధ్య‌లో అంటే 25 ఏండ్ల పాటు దేశంలో బంగారు వాడ‌కం ఎలా ఉన్నద‌నే దానిపై గోల్డ్ కౌన్సిల్ అధ్యయనం చేసింది.

బంగారం వినియోగంలో మార్పులకు ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల ఆదాయం, బంగారం రేట్ల‌లో మార్పు అనేవి కార‌ణాలుగా నిలిచినట్లు ఈ సర్వేలో తేలింది. ఆదాయం కంటే బంగారం రేట్ల‌లో పెరుగుద‌ల ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆదాయాలు పెర‌గ‌డం బంగారం రేట్ల‌పై ప్ర‌భావం చూపుతాయి. అంతే కాకుండా డిమాండ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క‌రి మీద స‌గ‌టున లెక్కిస్తే బంగారం కొనేందుకు స్తోమ‌త 1శాతం దేశం మొత్తం మీద పెరిగినా బంగారానికి గ‌ల డిమాండ్ క‌నీసం 1శాతం పెరుగుతుంది. ఒక్క శాతం బంగారం ధ‌ర‌ల్లో పెరుగుద‌ల సంభ‌విస్తే బంగారం డిమాండ్‌లో 0.% త‌గ్గుద‌ల క‌నిపిస్తుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.