సోమవారం 18 జనవరి 2021
National - Jan 06, 2021 , 15:33:26

సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపే దేశాలివే

సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపే దేశాలివే

ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేనిదే ఒక్క క్షణం కూడా గడపలేడంటే అతిశయోక్తి కాదు.. మనకు ఏది అవసరం ఉన్నా ముందుగా మన చేయి ఫోన్‌ వైపే వెళ్తుంటుంది. కాల్స్‌, మెసేజ్‌లు, వాట్సాప్‌ ఛాటింగ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లతో చాలా మంది బిజీగా ఉంటున్నారు.  ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సోషల్‌మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్నది. ఫిలిప్పీన్స్‌లో సగటున రోజుకు 3 గంటల 50 నిమిషాలు సోషల్‌మీడియాకే కేటాయిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ యూజర్లు సగటున రోజుకు 2గంటల 22 నిమిషాలు సోషల్‌మీడియాలో గడుపుతున్నారు.  భారత్‌లో సగటున 2:36 గంటల సమయాన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌  సైట్ల కోసం కేటాయిస్తున్నారు.  గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ సర్వే ప్రకారం చాలా దేశాల్లో 2018, 2019 గణాంకాలతో పోలిస్తే 2020 తొలి త్రైమాసికంలో కొన్ని దేశాల్లో సోషల్‌మీడియా వాడకం తగ్గిపోయింది.

46 దేశాల్లో  16-64 ఏండ్ల మధ్య వయసుగల 6,76,000 మంది ఇంటర్నెట్‌ యూజర్లు వెబ్‌ఇండెక్స్‌ సర్వేలో పాల్గొన్నారు. నివేదిక ఆధారంగా 2020లో  ఏఏ దేశాల్లో అత్యల్ప, అత్యధికంగా సోషల్‌మీడియాను వినియోగిస్తున్న దేశాల జాబితాను ఇక్కడ చూడొచ్చు. (సగటున రోజుకు గంటల్లో..)