గురువారం 16 జూలై 2020
National - Jun 30, 2020 , 13:42:37

చైనా యాప్స్ లేవ‌ని బాధ‌ప‌డుతున్నారా? వాటికి బ‌దులు ఇవి వాడండి!

చైనా యాప్స్ లేవ‌ని బాధ‌ప‌డుతున్నారా?  వాటికి బ‌దులు ఇవి వాడండి!

చైనాకు సంబంధించిన 59 యాప్‌ల‌ను భార‌త్ నిషేధించింది. భార‌తీయులు వాడే అత్యంత పాపుల‌ర్ అయిన యాప్‌ల‌న్నీ చైనాకు కావాడంతో బాధ‌ప‌డుతున్న వారంద‌రికీ సుభ‌వార్త‌. చైనా యాప్‌ల‌ను త‌ల‌ద‌న్నే యాప్‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అవి ఇవే.. 

వీడియో కాన్ఫరెన్స్‌ : వ‌ర్చువ‌ల్ క్లాసెస్‌, ఆఫీస్ మీటింగ్స్ అన్నింటికీ జూమ్ యాప్‌నే వాడుతున్నారు. ఈ యాప్‌ను నిషేధించ‌క‌పోయినా దీనికి పోటీగా గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌, సే నమస్తే వంటి యాప్స్ వాడుకోవచ్చు.

బ్రౌజింగ్ :  బ్రౌజింగ్ అన‌గానే యూసీ బ్రౌజర్ గుర్తొస్తుంది.  ఇప్పుడు ఇది లేదు కాబ‌ట్టి దానికి బ‌దులు గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటివి వాడొచ్చు.

స్కాన్‌ : ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, అడోబ్ స్కాన్, ఫొటో స్కాన్ బై గూగుల్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటి యాప్స్ వాడొచ్చు.

ఆఫీస్ వర్క్ : వర్డ్ ఎక్సెల్ షీట్ల వంటి వాటి కోసం మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, ఓన్లీ ఆఫీస్‌ వంటివి వాడొచ్చు.

సెక్యూరిటీ : మొబైల్‌లో వైరస్ చేరకుండా అవాస్తా, ఏవీజీ, నార్తన్‌‌ యాంటీ వైరస్‌ వంటి యాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.

రెండు అకౌంట్లు : ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే క్లోన్‌ యాప్‌, సూపర్‌ క్లోన్‌ వంటివి యాప్స్‌ ఉపయోగపడుతున్నాయి.

మొబైల్ లాక్‌ : లాక్‌ యాప్‌ - స్మార్ట్‌ యాప్‌ లాకర్, లాక్‌ యాప్‌ - ఫింగర్‌ ప్రింట్‌, కీప్‌ సేఫ్‌, నొర్టన్‌ యాప్‌ లాక్‌, లాక్‌ మై పిక్స్‌ సీక్రెట్‌ ఫొటో వాల్ట్‌ వంటివి వాడొచ్చు.

ఫోటో ఎడిటింగ్ : అడోబ్ ఫొటోషాప్, గూగుల్ స్నాప్‌సీడ్, పిక్స్ ఆర్ట్, లైట్ రూమ్, బీ612 వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు.

టైపింగ్ : ఇండిక్‌ కీబోర్డు , జీ బోర్డ్‌, గింగర్‌ కీబోర్డు, మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌ కీబోర్డు వంటివి వాడొచ్చు.

వీడియో ఎడిటింగ్ : వీడియోలను ఎడిట్ చెయ్యడానికి చాలానే ఆప్షన్లున్నాయి. అడోబ్ ప్రీమియర్‌ క్లిప్‌, మ్యాజిస్టో, కైన్‌ మాస్టర్‌ యాప్స్‌ బాగా ఉపయోగపడతాయి.

యాక్టివిటీస్‌‌ : టిక్‌టాక్ బదులుగా రోపోసో, డబ్‌ స్మాష్‌, పెరిస్కోప్‌, యూట్యూబ్ లాంటి వాటిని వాడొచ్చు.

ఫైల్స్‌ షేరింగ్ : షేరిట్‌ బదులుగా షేర్‌ ఫైల్స్‌, ఫైల్స్ బై, జీ షేర్‌ వంటి యాప్స్ వాడొచ్చు


logo