శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 21:14:08

బడ్జెట్ ధరలో..5జీ నోకియా ఫోన్లు ఇవే...

బడ్జెట్ ధరలో..5జీ నోకియా ఫోన్లు ఇవే...

ముంబై :హెచ్‌ఎండీ గ్లోబల్ మూడు కొత్త నోకియా ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 8.3, నోకియా 3.4, నోకియా 2.4 పేర్లతో వీటిని తీసుకొచ్చింది. ట్రిపుల్ రియర్‌ కెమెరా, 5జీ టెక్నాలజీ, హెచ్‌డీ+ డిస్‌ప్లే వంటివి 3.4 మోడల్ ప్రత్యేకతలు. అలానే 2.4లో వాటర్‌డ్రాప్‌ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. మరి ఈ ఫోన్ల ధరెంత వాటి వివరాలు... తెలుసుకుందామా...?   నోకియా 3.4: ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 460 ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 5ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది.

నోకియా 2.4: ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్‌ హీలియో పీ22 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మూడు కెమెరాలు ఉన్నాయి. వెనక రెండు, ముందు ఒకటి ఉన్నాయి. వెనక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నోకియా 3.4 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజి, 4జీబీ ర్యామ్‌/64జీబీ అంతర్గ మెమరీ వేరియంట్లలో లభిస్తుంది. నోకియా 2.4 2జీబీ ర్యామ్‌/32జీబీ, 3జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారు. నోకియా 3.4 మోడల్ ప్రారంభ ధర 159 యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.14,000. నోకియా 2.4 ప్రారంభ ధర 119 యూరోలు. మన కరెన్సీలో రూ. 11,000. అక్టోబరులో 3.4 మోడల్, సెప్టెంబరు చివరి నాటికి 2.4 అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. త్వరలోనే వీటిని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

నోకియా 8.3: ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.81 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ప్యూర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 5జీ టెక్నాలజీకి సపోర్ట్‌ చేస్తుంది. మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 64 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 12ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 8.3 మోడల్ యూరోపియన్ మార్కెట్‌కు మాత్రమే పరిమితమని హెచ్ఎండీ గ్లోబల్‌ తెలిపింది. 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర 599 యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 51,700. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.