బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 17, 2020 , 15:42:04

ఎలాంటి మీటింగ్ లేదు.. అవ‌న్నీ ఒట్టి పుకార్లు: ఎంకే అళ‌గిరి

ఎలాంటి మీటింగ్ లేదు.. అవ‌న్నీ ఒట్టి పుకార్లు: ఎంకే అళ‌గిరి

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రుణానిధి పెద్ద‌కుమారుడు అళ‌గిరి బీజేపీలో చేరనున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం ఒట్టిదేన‌ని తేలిపోయింది. 'నేను బీజేపీలో చేర‌బోతున్నాన‌ని, ఈ మేర‌కు ఈ నెల 21న‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నాన‌ని రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. అందులో ఏ మాత్రం నిజం లేదు. అవ‌న్నీ ఒట్టి పుకార్లే' అని అళ‌గిరి స్ప‌ష్టంచేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయంగా తాను ఎలాంటి స్టెప్ తీసుకోబోయేది కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాత నిర్ణ‌యిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. 

కాగా, అళ‌గిరి బీజేపీలో చేర‌బోతున్నారంటూ సోమ‌వారం కొన్ని టీవీ చానెళ్లు, సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు ఎల్ మురుగ‌న్‌ను వివ‌ర‌ణ కోర‌గా.. ఆ విష‌యంలో త‌న‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని, అయితే అళ‌గిరి పార్టీలోకి వ‌స్తానంటే సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని చెప్పారు. మురుగ‌న్ స్పంద‌న‌పై అళ‌గిరి మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఆయ‌న స్పందించిన తీరు సంతోష‌క‌ర‌మ‌ని, అయితే రాజ‌కీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకోవాల‌నే దానిపై తాను ఇంకా ఒక నిర్ణ‌యానికి రాలేద‌ని పేర్కొన్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.