శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 18:15:19

బుధవారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తాం: కర్ణాటక సీఎం

బుధవారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తాం: కర్ణాటక సీఎం

బెంగళూరు: తమ రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరిగి పనులకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. కరోనా నివారణకు లాక్‌డౌన్ పరిష్కారం కాదని సీఎం యోడియూరప్ప అభిప్రాయపడ్డారు. కేవలం కంటైన్‌మెంట్ జోన్ల వద్దనే ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వారి వల్ల తమ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కరోనా నియంత్రణకు ట్రేస్, ట్రాక్, టెస్ట్, ట్రీట్, టెక్నాలజీ అనే ఐదు టీల వ్యూహాన్ని తమ నిపుణులు సూచించినట్లు యెడియూరప్ప తెలిపారు.logo