మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 13:00:32

నితీశ్‌కుమార్‌, సుశీల్‌మోదీల‌కు ఎప్ప‌టికీ నా మ‌ద్ద‌తుండ‌దు: చిరాగ్ పాశ్వాన్

నితీశ్‌కుమార్‌, సుశీల్‌మోదీల‌కు ఎప్ప‌టికీ నా మ‌ద్ద‌తుండ‌దు: చిరాగ్ పాశ్వాన్

ప‌ట్నా: బీహార్‌లో ఎన్డీఏ కూట‌మికి ఎప్ప‌టికీ తాను మ‌ద్ద‌తివ్వ‌బోన‌ని లోక్‌జ‌నశ‌క్తి (LJP) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. నితీశ్‌కుమార్‌, సుశీల్‌మోదీల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి భ‌విష్య‌త్తులో కూడా మ‌ద్ద‌తివ్వ‌నని చిరాగ్ ప్ర‌క‌టించారు. నితీశ్‌కుమార్ వ‌ర‌స‌గా ముఖ్య‌మంత్రిగా కొన‌సాగినా స‌రే రాష్ట్రస్థాయిలో ఎన్డీఏకు మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టంచేశారు. అయితే కేంద్ర‌స్థాయిలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి మాత్రం త‌న మ‌ద్ద‌తు కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. 

లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ మీద బీహార్ ప్ర‌జ‌లు ప్రేమ చూపించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బీహార్ ఫ‌స్ట్‌, బీహారీ ఫ‌స్ట్ అన్న త‌మ నినాదాన్ని 25 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు విశ్వ‌సించార‌ని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఒంట‌రిగా బ‌రిలో దిగినా త‌మ‌కు 6 శాతం ఓట్లు ల‌భించాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇత‌రుల మ‌ద్ద‌తు లేకుండా నిల‌బడ‌లేని పార్టీ అని LJPపై అప‌వాదు ఉండేద‌ని, ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించామ‌ని వ్యాఖ్యానించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.