National
- Jan 17, 2021 , 14:52:39
VIDEOS
26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు

చండీగఢ్: ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని పంజాబ్ రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 50 రోజులుగా 40కిపైగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్నారు. ఇప్పటి వరకు జరిపిన 9 విడతల చర్చల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మరింత ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ట్రాక్టర్ మార్చ్‌లో పాల్గొనేందుకు పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్‌కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్‌కు ఈల వేయాల్సిందే
MOST READ
TRENDING