మంగళవారం 26 జనవరి 2021
National - Dec 05, 2020 , 17:23:50

నూత‌న భ‌వ‌నంలో లోక్‌స‌భ స‌భ్యుల‌కు 888 సీట్లు!

నూత‌న భ‌వ‌నంలో లోక్‌స‌భ స‌భ్యుల‌కు 888 సీట్లు!

న్యూఢిల్లీ: ‌నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం కోసం ఈ నెల 10న శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 10న మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు శంకుస్థాప‌న జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేతుల మీదుగా జ‌రిగే భూమిపూజతో కార్య‌క్ర‌మం మొద‌ల‌వుతుంద‌ని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు పూర్త‌యిన సంవ‌త్స‌ర‌మే మ‌నం పార్ల‌మెంటు నూత‌న భ‌వ‌నంలో రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ కార్య‌క‌లాపాలను ప్రారంభించ‌బోతున్నామ‌ని స్పీక‌ర్‌ తెలిపారు. 

కాగా, నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నంలో మొత్తం 1224 మంది స‌భ్యులు కూర్చునే విధంగా సీట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా వెల్ల‌డించారు. అందులో లోక్‌స‌భ స‌భ్యుల కోసం సుమారుగా 888 సీట్లు, రాజ్య‌స‌భ స‌భ్యుల కోసం 326కు పైగా సీట్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం పాత భ‌వ‌నం కంటే 17,000 చ‌ద‌ర‌పు మీట‌ర్లు ఎక్కువ విస్తీర్ణంలో ఉండంనుంద‌ని చెప్పారు. కొత్త భ‌వ‌నం దేశంలోని వైవిధ్యాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌ని ఓం బిర్లా తెలిపారు. 

మొత్తం రూ.971 కోట్ల‌ ఖ‌ర్చుతో 64,500 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు లోక్‌స‌భ స్పీక‌ర్ వెల్ల‌డించారు. ఈ భ‌వ‌న నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి అప్ప‌గించిన‌ట్లు తెలిపారు. HCP డిజైన్‌, ప్లానింగ్ అండ్ మేనేజ‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం డిజైన్‌ను తయారుచేసింద‌ని ఓం బిర్లా చెప్పారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo