సోమవారం 30 మార్చి 2020
National - Feb 11, 2020 , 01:12:39

మాంద్యం ఉంటే ధోతి కట్టేవారు

మాంద్యం ఉంటే ధోతి కట్టేవారు
  • ప్రజలు జాకెట్లు, ప్యాంట్ల్లు కొంటున్నారు.. యూపీ బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్‌

బలియా: దేశంలో మాంద్యం లేదు అనేందుకు ప్రజలు ధరిస్తున్న దుస్తులే నిదర్శనమని బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్‌ మస్త్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ అంత అధ్వానంగా ఉంటే ప్రజలు ధోతి, కుర్తాలు వేసుకొనేవారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం ఆర్థిక మాంద్యంలో పడింది కానీ, భారత్‌లో మాత్రం మాంద్యం ప్రభావంలేదని చెప్పారు. గ్రామీణ, వ్యవసాయ ఆర్థికవ్యవస్థ బలంగా ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ‘ఆర్థిక మాంద్యం ఉండిఉంటే.. మేం కోట్లు, జాకెట్లకు బదులుగా ధోతి, కుర్తాలను ధరించి ఇక్కడకు వచ్చేవాళ్లం. ఆర్థికమాంద్యం ఉంటే దుస్తులు, ప్యాంట్లు, పైజామాలు కొనలేం’ అని మస్త్‌ అన్నారు. 

logo