గురువారం 21 జనవరి 2021
National - Dec 20, 2020 , 14:56:45

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ లేన‌ట్లే!

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ లేన‌ట్లే!

న్యూఢిల్లీ: ఇండియాలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప‌లువురు నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఒక‌వేళ వ‌చ్చినా.. అది మొద‌టి వేవ్ స్థాయిలో ఉండ‌ద‌ని కూడా వాళ్లు తేల్చి చెబుతున్నారు. ప్ర‌స్తుతం దేశంలో కేసుల సంఖ్య కోటి దాటినా.. రోజువారీ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీగా త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త 21 రోజులుగా కేసుల సంఖ్య 40 వేల లోపే ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా స్ప‌ష్టం చేసింది. తాజాగా శ‌నివారం కూడా దేశంలో కేసుల సంఖ్య 26,624కు ప‌రిమితం కాగా.. కోలుకున్న వారి సంఖ్య 29,690 కావడం విశేషం. ఈ నేప‌థ్యంలో దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ముప్పు లేన‌ట్లేన‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు.

ఆ స్థాయిలో ఇక ఉండ‌వు

సెప్టెంబ‌ర్ నెల మ‌ధ్య‌లో రోజువారీ కేసులు సుమారు ల‌క్ష‌ను తాక‌గా.. ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇక భ‌విష్య‌త్తులో ఆ స్థాయి కేసులు ఉండ‌బోవ‌ని ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ షాహిద్ జ‌మీల్ అన్నారు. అయితే న‌వంబ‌ర్ చివ‌ర్లో ఉన్న‌ట్లుగా అప్పుడ‌ప్పుడూ కేసుల సంఖ్య పెర‌గ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే దేశంలో ద‌స‌రా, దీపావ‌ళిలాంటి పండ‌గ‌ల సీజ‌న్, ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు కూడా ముగిసిపోయాయి. అయినా కేసుల సంఖ్య పెర‌గ‌లేదు. ఆ లెక్క‌న ఇక సెకండ్ వేవ్ ఉంటుంద‌ని నేను అనుకోవ‌డం లేదు అని ఆయ‌న చెప్పారు. 

మొద‌టి వేవ్ తీవ్ర‌త ఉండ‌దు

ఒక‌వేళ సెకండ్ వేవ్ వ‌చ్చినా కూడా అది మొద‌టి దాని స్థాయి తీవ్ర‌త క‌లిగి ఉండ‌ద‌ని మ‌రో ప్ర‌ముఖ సైంటిస్ట్ గ‌గ‌న్‌దీప్ కాంగ్ అన్నారు. వ్యాధి సంక్ర‌మ‌ణ అనేది అంత వేగంగా కూడా ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఇప్ప‌టికే హెర్డ్ ఇమ్యూనిటీ వ‌చ్చేసింది.. ఇక మ‌నం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు అనుకుంటే పొర‌పాటే. ఈ స‌మ‌స్య మొత్తంగా పోలేదు. హెర్డ్ ఇమ్యూనిటీతో పోదు కూడా. అయితే మొద‌ట వ‌చ్చిన తీవ్ర‌త మాత్రం మ‌ళ్లీ ఉండ‌దు అని గ‌గ‌న్‌దీప్ స్ప‌ష్టం చేశారు. 

ఈ లిస్ట్‌లో 15 దేశాలు

ప్ర‌స్తుతం దేశంలో ఇంకా 30 నుంచి 40 శాతం మంది అస‌లు కొవిడ్ బారిన ప‌డ‌లేద‌ని ప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్ కేకే అగ‌ర్వాల్ చెప్పారు. ప్ర‌పంచంలో ఇండియా, అర్జెంటీనా, పోలాండ్‌తోపాటు 15 దేశాల్లో సెకండ్ వేవ్ క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఇండియాలో సెకండ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. ఒక‌వేళ వ‌చ్చినా అది వైర‌స్ కొత్త వేరియంట్ వ‌ల్ల వ‌స్తుంది. జ‌న‌వ‌రిలో ఇండియా వ్యాక్సినేష‌న్ మొద‌లుపెట్టి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే మాత్రం మార్చి క‌ల్లా క‌రోనాను పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి తీసుకురావ‌చ్చు అని అగ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు. కొత్త వేరియంట్ వ‌ల్ల సెకండ్ వేవ్ వ‌చ్చినా.. దాని వ‌ల్ల కేసులు పెరుగుతాయే గానీ మ‌ర‌ణాల సంఖ్య కాద‌ని ఆయ‌న చెప్పారు. పైగా దీనివ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ కూడా సాధించే అవ‌కాశాలు ఉన్నాయని తెలిపారు. 


ఇవి కూడా చ‌ద‌వండి

ఇండియా 36 ఆలౌట్‌.. పండ‌గ చేసుకుంటున్న పాకిస్థాన్‌

మీకు తెలుసా.. జ‌న‌వ‌రి 1 నుంచి ఈ నిబంధ‌న‌లు మారుతున్నాయ్‌!


logo