గురువారం 26 నవంబర్ 2020
National - Apr 29, 2020 , 17:50:25

కూరగాయల కొరత లేదు : నరేంద్రసింగ్‌ తోమర్‌

కూరగాయల కొరత లేదు : నరేంద్రసింగ్‌ తోమర్‌

ఢిల్లీ : దేశంలో కూరగాయల కొరత లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ నేపథ్యంలో సైతం దేశంలో కూరగాయల కొరత లేదన్నారు. వ్యవసాయం ఎంత ప్రాముఖ్యమో మనందరికి తెలిసిందే. కేంద్రం ఎల్లప్పుడూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యవసాయ ఆదాయం ఎంతో ముఖ్యమన్నారు. ఈ రోజు వరకు ఎవరూ కూడా కూరగాయల కొరత ఎదుర్కొలేదన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద దేశవ్యాప్త రైతులకు రూ. 17 వేల 986 కోట్లు వారి వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు తోమర్‌ పేర్కొన్నారు.