బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 12:42:15

రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వానికి చోటు లేదు: సచిన్ పైలట్

రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వానికి చోటు లేదు: సచిన్ పైలట్

జైపూర్: రాజకీయాల్లో దుర్మార్గానికి లేదా వ్యక్తిగత శత్రుత్వానికి చోటు లేదని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఎదురు తిరిగిన ఆయన చాలా రోజుల తర్వాత మీడియాతో మంగళవారం మాట్లాడారు. రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమైన విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రియాంకజీ, రాహుల్‌జీ తమ మనోవేదనను ఓపికగా విన్నారని సచిన్ పైలట్ చెప్పారు. వాటిని పరిష్కరించడానికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను,

కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని సచిన్ పైలట్ చెప్పారు. తాము లేవనెత్తిన సమస్యలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తనకు ఎలాంటి పదవి వద్దన్న సచిన్ పైలట్.. అవి వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని, మనపై వారి నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో మనం పనిచేయాలని సచిన్ పైలట్ తెలిపారు.logo