శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 19:48:46

ఉద్యోగులకు భారీ ఝలక్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఉద్యోగులకు భారీ ఝలక్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ : ఇంక్రిమెంట్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకు జీతాల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ నెల 11న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుత కరోనా వైరస్‌ పరిస్థితుల నేపథ్యంలో ఏడాది పాటు ఇంక్రిమెంట్లు ఉండవంది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనితీరు అంచనా గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


logo