శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 06, 2020 , 02:32:23

ఉద్యోగాల భర్తీపై నిషేధం లేదు

ఉద్యోగాల భర్తీపై నిషేధం లేదు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్రం ప్రకటించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్థికశాఖ శనివారం తెలిపింది. ఈ శాఖ పరిధిలోని వ్యయ విభాగం ఖర్చులు తగ్గించుకోవాలని, కొత్తగా ఎలాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టరాదని అన్ని శాఖలకు శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో స్పష్టతనిచ్చింది.