గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 08:29:24

త‌మిళ‌నాడులో రాగ‌ల 24 గంటల్లో 12 జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌

త‌మిళ‌నాడులో రాగ‌ల 24 గంటల్లో 12 జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌

చెన్నై: ఉష్ణచలనం కారణంగా త‌మిళ‌నాడులో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెన్నై వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న‌ 24 గంటల్లో 12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వ‌ర్షాలు కురువవ‌చ్చ‌ని వారు వెల్ల‌డించారు. ఉష్ణచలనం ప్ర‌భావంతో అరియలూరు, కడలూర్‌, విల్లుపురం, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్టణం, పుదుకోట, రామనాథపురం, శివగంగ, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియకుమారి జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డుతాయ‌ని వారు తెలిపారు. అదేవిధంగా కన్నియకుమారి, నాగపట్టణం జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని అధికారులు వెల్ల‌డించారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo