సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 11:26:07

చొర‌బడేందుకు పొంచి ఉన్న 300 మంది ఉగ్ర‌వాదులు..

చొర‌బడేందుకు పొంచి ఉన్న 300 మంది ఉగ్ర‌వాదులు..

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డేందుకు పొంచి ఉన్న‌ట్లు బీఎస్ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు.  పాక్‌లోని లాంచ్ ప్యాడ్ల వ‌ద్ద సుమారు 300 వ‌ర‌కు ఉగ్ర‌వాదులు భార‌త్‌లో ప్ర‌వేశించేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  అయితే అక్ర‌మంగా చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారిని మ‌న ద‌ళాలు అడ్డుకుంటున్న‌ట్లు రాజేశ్ మిశ్రా తెలిపారు. శుక్ర‌వారం రోజున పాక్ ద‌ళాలు .. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద  కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే.  భారీ ఆయుధాల‌తో పాక్ ద‌ళాలు భార‌త్ వైపు ఫైరింగ్ జ‌రిపాయి.  ఆ కాల్పుల్లో భార‌త్‌కు భారీ ఆస్తి న‌ష్టమే జ‌రిగిన‌ట్లు బీఎస్ఎఫ్ ఆఫీస‌ర్ చెప్పారు. గురేజ్‌, యురి సెక్టార్ల మ‌ధ్య‌లో జ‌రిగిన కాల్పుల్లో సుమారు 11 మంది మ‌ర‌ణించారు. దాంట్లో అయిదుగురు జ‌వాన్లు కూడా ఉన్నారు. శుక్ర‌వార‌మే భార‌త్ కూడా భారీ ఎత్తున ఫైరింగ్ జ‌రిపింది. ఆ కాల్పుల్లో పాక్ ఆర్మీ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి.