శనివారం 16 జనవరి 2021
National - Dec 05, 2020 , 19:30:22

కోపంలో స్మృతి ఇరానీ ఎలా ఉంటారంటే..?

కోపంలో స్మృతి ఇరానీ ఎలా ఉంటారంటే..?

న్యూ ఢిల్లీ: కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి స్మృతిఇరానీ సోషల్‌మీడియాలో చమత్కారమైన, హాస్యభరితమైన పోస్టులతో నెటిజన్లను అలరిస్తుంటారు. ఇటీవల ఆమె ‘అప్పుడు వర్సెస్‌ ఇప్పుడు’ అనే శీర్షికతో పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. 

‘తాజాట్యూస్‌డేస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఫోటోలను పోస్ట్‌ చేశారు. రెండు ఫొటోలను ఆమె షేర్‌ చేయగా, అందులో ఒకటి చిన్ననాటిఫొటోకాగా..రెండోది ప్రస్తుత ఫొటో. రెండు ఫొటోల్లోనూ ఆమె కోపంగా ఉంది.  ‘రూపం మారినా..హావభావాలు మారవు’ అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు 57,000 లైక్స్‌ వచ్చాయి. కేంద్ర  యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి కిరెన్ రిజిజు కూడా ఈ పోస్ట్‌కు లైక్‌ కొట్టారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.