బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 14:30:17

కలెక్టర్‌ నివాసంలో చోరీ..

కలెక్టర్‌ నివాసంలో చోరీ..

చెన్నై : తమిళనాడు కడలూరు కలెక్టర్‌ నివాసంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. నదియం గ్రామంలోని కలెక్టర్‌ నివాసంలోకి దొంగలు చొరబడి.. విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించారు. దీంతో కలెక్టర్‌ కుటుంబ సభ్యులు సేతుభవచత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కలెక్టర్‌ నివాసాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫింగర్‌ ప్రింట్స్‌ను సేకరించారు. స్నిఫర్‌ డాగ్స్‌తో తనిఖీలు నిర్వహించారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


logo