మంగళవారం 31 మార్చి 2020
National - Feb 17, 2020 , 14:45:43

2022 నుంచి మిలిట‌రీ థియేట‌ర్ క‌మాండ్లు : బిపిన్ రావ‌త్‌

2022 నుంచి మిలిట‌రీ థియేట‌ర్ క‌మాండ్లు :  బిపిన్ రావ‌త్‌

హైద‌రాబాద్‌:  భార‌త్‌లో రెండు నుంచి అయిదు థియేట‌ర్ క‌మాండ్ల‌ను ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు.  తొలి థియేట‌ర్ క‌మాండ్‌ 2022లో ప్రారంభం అయ్యే సూచ‌న‌లు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  యుద్ధ స‌మ‌యంలో అన్ని ర‌క్ష‌ణ ద‌ళాలు ఒకే ల‌క్ష్యంతో ప‌నిచేసేందుకు థియేట‌ర్ క‌మాండ్లు ఉప‌క‌రిస్తాయి.  అయితే జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక థియేట‌ర్ క‌మాండ్ ఉంటుంద‌ని, కానీ దాన్ని ఇప్పుడే ఫైన‌లైజ్ చేయ‌లేదన్నారు.  థియేట‌ర్ క‌మాండ్‌లో.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ద‌ళాల‌న్నీ క‌లిసి ఒక క‌మాండ్‌గా ప‌నిచేస్తాయి. లాజిస్టిక్స్‌, ట్రైనింగ్ కోసం ప్ర‌త్యేక జాయింట్ క‌మాండ్లు ఉంటాయ‌న్నారు.  మిలిట‌రీ థియేట‌ర్ క‌మాండ్ల గురించి ప్ర‌స్తుతం స్ట‌డీ జ‌రుగుతోంద‌ని, దాని రిపోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని జ‌న‌ర‌ల్ రావ‌త్ తెలిపారు.  2021లో ఎయిర్ డిఫెన్స్ క‌మాండ్‌ను ఆరంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 


logo
>>>>>>