శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 21:50:15

పులిదాడిలో యువకుడు మృతి

పులిదాడిలో యువకుడు మృతి

చంద్రాపూర్‌ : మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా కేమారా గ్రామానికి చెందిన యువకుడిపై పులిదాడి చేసి హతమార్చింది. కేమారా గ్రామానికి చెందిన సుజాత్ నెవారే (18) ఉదయం పోంభూర్ణ తహసీల్‌ పరిధిలో బుధవారం మధ్యాహ్నం పులి గొర్రెల మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొదల్లో ఉన్న పులి అతడిపై దాడిచేసి హతమార్చింది. నెవారే ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామస్తులు సాయంతో గాలించగా మృతదేహం కనిపించింది. అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది జిల్లాలో పులిదాడిలో 23 మంది, చిరుత దాడిలో నలుగురు అడవి పంది దాడిలో మరొకరు మొత్తం 28 మంది మృత్యువాతపడ్డారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo